☼ Suryaa News
🔴 తెలంగాణ కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు
తెలంగాణ

కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు

21 Sep 2026 nalgondamastan

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
మిర్యాలగూడ అర్బన్, మేజర్ర్ న్యూస్: మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవన్‌లో ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.
వక్తలు మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషి, బీసీల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పిల్లలమర్రి రవికుమార్, వ్యవస్థాపక కన్వీనర్ పున్న రాములు, మాజీ అధ్యక్షులు రాపోలు సత్యనారాయణ, బీసీ జేఏసీ కో-కన్వీనర్లు దాసరాజు జయరాజు, చేగొండి మురళి యాదవ్, లింగంపల్లి చిరంజీవి, బీసీ జేఏసీ నాయకులు పున్న దయాకర్, గుర్రం యాదగిరి, నక్క సత్యం, కీర్తి అశోక్, పి. భీమయ్య, బి. నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home