సూర్య జగిత్యాల ప్రతినిధి: ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ వెల్ఫేర్ మంత్రి అజాహారుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.
తెలంగాణ