☼ Suryaa News
🔴 తెలంగాణ అర్చకుడి కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ

అర్చకుడి కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం

20 Sep 2026 karimnagarvenkatesh

సూర్య జగిత్యాల ప్రతినిధి:  జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ధూపదీప నైవేద్య అర్చకుడు సింహాచలం జగన్ కుటుంబానికి జగిత్యాల జిల్లా, రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సమాఖ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  రూ.1,08,720 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా అర్చక సంఘం ప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కష్టసుఖాల్లో అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ధూపదీప నైవేద్య సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ ఎన్. మహేంద్రాచార్య, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు ఓరుగంటి మాధవాచార్యులు, గ్రామ పురోహితులు ఆరుట్ల రంగాచార్యులు, ఇతర అర్చకులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home