☼ Suryaa News
🔴 తెలంగాణ కార్పొరేటర్‌ను బయటకు పంపించారా? రామగుండం నగర కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్పొరేటర్ల ధర్నా…
తెలంగాణ

కార్పొరేటర్‌ను బయటకు పంపించారా? రామగుండం నగర కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్పొరేటర్ల ధర్నా…

15 Sep 2026 Reporter

సూర్య-గోదావరిఖని:

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. తన డివిజన్ పరిధిలోని పెండింగ్‌ సమస్యలపై వివరాలు తెలుసుకునేందుకు కమిషనర్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జె.అరుణశ్రీని కలిసేందుకు వెళ్లిన స్థానిక 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ కౌటం సతీష్‌ను అటెండర్‌ ద్వారా బయటకు పంపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి కార్పొరేటర్లు కమిషనర్‌ చాంబర్‌ ఎదుట రాత్రి 8 గంటల సమయంలో ధర్నాకు దిగారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ లతో పాటు ప్రతిపక్ష కార్పొరేటర్లు సైతం ధర్నాలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్‌తో వ్యవహరించిన తీరుపై కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home