☼ Suryaa News
🔴 తెలంగాణ కరెన్సీ నోట్లతో గణపేశ్వరుడి అలంకరణ
తెలంగాణ

కరెన్సీ నోట్లతో గణపేశ్వరుడి అలంకరణ

21 Sep 2026 Purushotham

కరెన్సీ నోట్లతో గణపేశ్వరుడి అలంకరణ

గణపురం, సెప్టెంబర్ 21 మేజర్ న్యూస్ సూర్య : గణపురం మండల కేంద్రంలోని చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా స్వామివారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో కరెన్సీ నోట్లతో గణపేశ్వరుడిని అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home