☼ Suryaa News
🔴 జాతీయం గోయల్ నివాసంలో ప్రధాని మోదీ గణపతి పూజలు
జాతీయం

గోయల్ నివాసంలో ప్రధాని మోదీ గణపతి పూజలు

14 Sep 2026 vasu

న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, శ్రీ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ప్రధాని స్వామివారిని ఆకాంక్షించారు.

ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, వినాయక చవితి వేడుకల వేళ గోయల్ నివాసంలో విఘ్నేశ్వరుని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home