☼ Suryaa News
🔴 అంతర్జాతీయం చైనీస్ తైపీ చేతిలో భారత పురుషుల సాఫ్ట్ టెన్నిస్ జట్టు ఓటమి
అంతర్జాతీయం

చైనీస్ తైపీ చేతిలో భారత పురుషుల సాఫ్ట్ టెన్నిస్ జట్టు ఓటమి

18 Sep 2026 vasu

టెక్‌బాల్‌లో క్విన్సీ సెమీస్‌కు
నగోయా: ఆసియా క్రీడల్లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్-సి ప్రాథమిక రౌండ్ మ్యాచ్‌లో భారత పురుషుల సాఫ్ట్ టెన్నిస్ జట్టు చైనీస్ తైపీ చేతిలో 0-3 తేడాతో ఓటమి పాలైంది. డబుల్స్ విభాగంలో జై మీనా-యోగేష్ చౌదరి జంట, సింగిల్స్‌లో ఆర్యన్ ఠాకూర్, ఆపై రెండో డబుల్స్‌లో అనికేత్ పటేల్-ఓమ్ యాదవ్ జోడీ పరాజయం పాలయ్యారు. కాగా భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో మంగోలియాపై విజయం సాధించి పుంజుకోవాలని భావిస్తోంది.

మరోవైపు ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసిన టెక్‌బాల్ క్రీడలో భారత అథ్లెట్ క్విన్సీ జోవాక్విమ్ డిసౌజా అద్భుత ప్రదర్శన కనబరిచింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎ విభాగంలో వరుసగా జపాన్ అథ్లెట్ యుయినా సకమోటోపై 2-1తోనూ, కంబోడియాకు చెందిన కోమ్‌యెన్ డివైపై 2-0తోనూ ఘనవిజయాలు సాధించి నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సింగిల్స్‌లో మెరిసిన క్విన్సీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో మహ్మద్ అనస్ ఇమ్రాన్ బెగ్‌తో కలిసి ఫిలిప్పీన్స్ జోడీతో తలపడనుంది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home