☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఎమ్మిగనూరులో ఘనంగా కోట్ల జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరులో ఘనంగా కోట్ల జన్మదిన వేడుకలు

18 Sep 2026 Reporter

కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి జన్మ దిన వేడుకలు


     మాజీ కేంద్ర మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారి 76 వ జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలో టిటిడి కళ్యాణ మండపం దగ్గర కోట్ల అభిమానులు, టిడిపి నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి,కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సీనియర్ నాయకులు మల్కాపురం సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ బి.నాగిరెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 1952 నుండి రాజకీయాలలో కొనసాగుతున్న కోట్ల కుటుంబం పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం రాజకీయ మార్పు కోరి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 2019 లో చంద్రన్నకు తోడుగా, రైతన్నకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కోట్ల కుటుంబానికి ఎమ్మిగనూరు నియోజకవర్గంతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఎల్.ఎల్.సి ఆధునీకరణ, నాగలదిన్నె గ్రామంలో తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మాణం వంటి శాశ్వత పనులు వారికే దక్కాయని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు 
కోట్ల తోనే సాధ్యమన్నారు. కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి మూడుసార్లు లోకసభ సభ్యునిగా, ఓక సారి కేంద్రమంత్రిగా కొనసాగి నేడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కర్నూలు జిల్లా అభివృద్ధికి పాటుబడిన ఏకైక వ్యక్తి అని తెలిపారు. నీతికి నిజాయితీకి నిలువుటద్దమైన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏనాడు పదవుల కోసం వెంపర్లాడ లేదన్నారు. పల్లె పల్లెకు త్రాగునీరు, సాగునీరు అందించి సీమ "అపర భగీరథుడు" గా నిలిచిన ఘనత కోట్లకే దక్కిందని కొనియాడారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లి రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించి కర్నూలు జిల్లాను సస్యశ్యామలంగా మార్చడానికి   పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు టిడిపి నాయకులు డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  టీడీపీ కోట్ల వర్గం ఆరవీటి సుధాకర్ శెట్టి, ఎమ్మిగనూరు మండలం టిడిపి మాజీ అధ్యక్షులు బనవాసి ఆదినారాయణ రెడ్డి,కదిరికోట ఆదెన్న, నందవరం మండలం టిడిపి నాయకులు టి. సోమల గూడూరు కమల నాబరెడ్డి, ముగతి వీరారెడ్డి, కడివెళ్ళ మాజీ ఎంపీటీసీ పి.బి. లింగన్న, బనవాసి శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్ హెచ్.పి.గ్యాస్ ఏజెన్సీ బూదురు రాఘవేంద్రారెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు,కె.తిమ్మాపురం గ్రామ టిడిపి నాయకులు ఉప్పర వీరేష్, బోయ బి.టి.హనుమంతు, ఎస్సీ కాలనీ టిడిపి నాయకులు సప్లయర్స్ బంగారప్ప, వన్నెల మోషన్న,పి.సురేష్,టి. ఈరన్న, జె.జైపాల్, కదిరి కోట ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home