☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వినాయక మా గోడు వినవయ్య
ఆంధ్రప్రదేశ్

వినాయక మా గోడు వినవయ్య

15 Sep 2026 Reporter

వినాయకా మా గోడు వినవయ్య.. 

రోడ్డు వేయించాలి అంటూ చిన్నారుల వనూత్న విన్నపం 

 

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి 

 

 మున్సిపల్ కార్యాలయాల చుట్టూ కాలు అరిగేలా వినతి పత్రాలు అందించిన అక్కడి అధికారులు స్పందించరు.. కౌన్సిల్ తీర్మానం చేసిన రోడ్డు విషయం పట్టించుకోరు.. అంటూ ఎమ్మినూరు పట్టణంలోని యువర్స్ కాలనీకి చెందిన చిన్నారులు వినూత్నంగా వినాయకునికి రోడ్డు లేని దుస్థితి నుండి విముక్తులు చేయాలంటూ  వినూత్నంగా వినాయకునికి వినతి పత్రం అందించారు.. మంగళవారం వినాయక మా విఘ్నాలు తొలగించి.. మా విన్నపం వినవయ్య.. మా రోడ్డు సమస్య తీర్చవయ్యా.. అంటూ ఎమ్మినూరు పట్టణంలోని 22వ వార్డు, వీవర్స్ కాలనీ, శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం దగ్గర  గల కాలనీలోని చిన్నారులు కళ్యాణ్ , తమన్, భరద్వాజ్ , చైత్ర శ్రీ,  వీక్షిత , చిన్న లు వినాయకునికి వినతి పత్రాన్ని మంగళవారం అందించారు. తమ వీధిలో 45  సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేదని, రోడ్డు లేని కారణంగా నానా అవస్థలు పడుతున్నామని, అధికారులకు , నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని చెప్పారు. వినాయక చవితి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం లో ఏర్పాటుచేసిన వినాయకునికి వినతి పత్రాన్ని అందించి తమ సమస్యను విన్నవించారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home