భక్తి చాటిన ఏలూరి మాధవరావు
- రూ.43,056కు వినాయకుడి లడ్డూ దక్కించుకున్న ఏలూరి మాధవరావు
పామూరు, సూర్య ప్రతినిధి :
మండలంలోని కంబాలదిన్నె గ్రామంలో శుక్రవారం వినాయక స్వామి నిమజ్జనం సందర్భంగా పాత బ్యాంకు సెంటర్‌లోని చౌదరి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. వినాయక స్వామి లడ్డూను తెలుగుదేశం పార్టీ కంబాలదిన్నె తెలుగు యువత అధ్యక్షుడు ఏలూరి మాధవరావు (కోటయ్య) రూ.43,056కు పాడి దక్కించుకున్నారు. బొడ్డులో రూపాయిని కొండ మురళి నరేష్ రూ.7,116కు, హుండీని గోళ్ల సతీష్ రూ.17,500కు పాడి దక్కించుకున్నారు. వేలంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలను దక్కించుకున్న వారిని, వారి కుటుంబ సభ్యులను వినాయక స్వామి చల్లగా చూడాలని చౌదరి యూత్ ఫోర్స్ సభ్యులు ఆకాంక్షించారు.