☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు

13 Sep 2026 Reporter

ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు

ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు

ప్రకాశం జిల్లా ప్రజలకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వినాయకచవితి పండుగ‌ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజలంతా ఐకమత్యం, ఆనందంతో గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. మన రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తూ, ప్రతి రైతు, ప్రతి కూలీ, ప్రతి కుటుంబం సంతోషంగా జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాత్రుత్వం, సమగ్ర అభివృద్ధి నెలకొనేలా ఈ పండుగ తోడ్పడాలని అన్నారు. ఈ వినాయ‌క  చ‌వితి అంద‌రి జీవితాల్లో  ఆరోగ్యం, సంప‌ద‌ను నింపాల‌ని  ఆకాంక్షిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతలకు ఈ పండుగ ప్రతీక అని, ప్రతి ఇంటి నుంచీ మొదలుకొని ప్రతి వీధి వరకు ఈ పండుగ ఆనందోత్సాహాలను పంచుతుందని అన్నారు. విఘ్నేశ్వరుడు శుభారంభాలకు సంకేతం, విజయానికి దారికొల్పే దేవుడని ప్రజలందరూ గణపతి ఆశీస్సులతో ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్న‌ట్లు దామచర్ల జనార్దన్ రావు తెలియ‌జేశారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home