☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్* *ప్రతి ఇంటికి మట్టి విగ్రహాన్ని అందజేసిన ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్
ఆంధ్రప్రదేశ్

వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్* *ప్రతి ఇంటికి మట్టి విగ్రహాన్ని అందజేసిన ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్

13 Sep 2026 Reporter

*

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తన స్వగ్రామం రామగిరి మండలం వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఇంటికి మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. వెంకటాపురం తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఈ మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి అంటే ఎంతో సందడిగా చేసుకునే పండుగ అని... అయితే ఇటీవల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడటం వల్ల నీటి కాలుష్యం బాగా పెరిగిందన్నారు. దీనిని నివారించేందుకు ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను పూజించాలన్న లక్ష్యంతోనే ఈ విగ్రహాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పండుగ అన్నది పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మట్టి వినాయక విగ్రహాలను గరికతో పూజించాలని... దీనిని ఎవరు మర్చిపోవద్దని సూచించారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు వారు ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.....

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home