☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత

15 Sep 2026 Reporter

ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది

రిటైర్డ్ ఐఆర్ఎస్ లక్క భూషణం, ఎంఈఓలు బ్రహ్మం నాయక్, కోటయ్యలు

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

నంద్యాల అర్బన్:

సమాజ నిర్మాత ఉపాధ్యాయుడే అని రిటైర్డ్ ఐఆర్ఎస్ లక్క భూషణం, నంద్యాల, పాణ్యం మండల విద్యాధికారులు బ్రహ్మం నాయక్, కోటయ్యలు అన్నారు.  సోమవారం రాత్రి పట్టణం లోని రోటరీ స్కూల్ నందు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుబ్బన్న అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ పొందిన నంద్యాల మండలం రాయమాల్పురం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్, పాణ్యం మండలం కొణిదేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్,  సిరివెళ్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సురేష్ లను ఘనంగా సత్కరించారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన బ్రహ్మం, కోటయ్య, లక్కభూషణం ఆళ్లగడ్డ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నల్లమల రాజు, ఎస్.ఎ.పి.డి మరియు పీఈటి అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రవికుమార్, గౌరవాధ్యక్షులు కేశవ నాయక్ తదితరులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది అని అన్నారు.  ఉపాధ్యాయులు చేసిన సేవలను కొనియాడారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం మరియు నాణ్యమైన విద్యను అందించి చిన్నారులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని వారు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు సుబ్బన్న మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తా మని తెలిపారు. అవార్డు గ్రహీతలను రోటరీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సుబ్బయ్యతో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సర్వేర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home