☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ సిల్క్ సిటీ... గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత సిటీగా ఉండాలి* *పట్టణ ప్రజలకు ధర్మవరం తెదేపా ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపు*
ఆంధ్రప్రదేశ్

సిల్క్ సిటీ... గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత సిటీగా ఉండాలి* *పట్టణ ప్రజలకు ధర్మవరం తెదేపా ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపు*

13 Sep 2026 Reporter

*సిల్క్ సిటీ... గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత సిటీగా ఉండాలి*

 *పట్టణ ప్రజలకు ధర్మవరం తెదేపా ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపు*

*ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ*

 *ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని శ్రీరామ్ విజ్ఞప్తి*

సిల్క్ సిటీగా ఉన్న ధర్మవరం పట్టణం గ్రీన్ సిటీగా మారాలని... అలాగే కాలుష్య రహిత పట్టణంగా ఉండాలని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆకాంక్షించారు. ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి విగ్రహాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఆర్యవైశ్య యువజన సంఘాన్ని శ్రీరామ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన ధర్మవరం పట్టణానికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారని... ఇలాంటి సమయంలో మన ప్రాంతం పరిశుభ్రంగా కాలుష్యరహితంగా ఉండాలన్నారు. అలాగే పెద్ద ఎత్తున మొక్కలు పెంచి గ్రీన్ ధర్మవరంగా మారాలని కోరుకున్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేశారు. కాలుష్యరహిత సమాజం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు..…

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home