☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఎంపీపీని పరామర్శించిన బుట్టా దంపతులు
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీని పరామర్శించిన బుట్టా దంపతులు

16 Sep 2026 Reporter

ఎంపీపీని పరామర్శించిన బుట్టా  దంపతులు

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

గోనెగండ్ల మండల మాజీ ఎంపీపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  నసూరుద్దీన్‌ ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు  బుట్టా రేణుక   పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నసీరుద్దీన్  ఆరోగ్య పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకున్నారు. బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ తో పాటు కలిసి గోనెగండ్ల మండల కేంద్రంలోని నసూరుద్దీన్‌  నివాసానికి చేరుకున్న బుట్టా రేణుక  ఆయనను  పలకరించి ఆరోగ్య పరిస్థితిపై అరా తీశారు.  నసీరుద్దీన్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా బుట్టా రేణుక  మాట్లాడుతూ.. నసూరుద్దీన్‌  సేవలు పార్టీకి, గోనెగండ్ల మండలానికి అవసరం ఆయననేపథ్యంలో అయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. అనంతరం నసూరుద్దీన్‌  సతీమణిని కూడా బుట్టా రేణుక  పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, మనోధైర్యాన్ని నింపారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ…

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home