నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలను స్వీకరించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అనంతరం శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో భాగంగా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ప్రజా వినతులను స్వీకరించారు. టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, స్థానిక నేతలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం ప్రసిద్ధ శ్రీ కొత్తమ్మతల్లి ఉత్సవాల నిర్వహణపై కమిటీ సభ్యులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున గతంలో కంటే మిన్నగా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.
తాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, వైద్య శిబిరాలు, రవాణా సౌకర్యాలను ముందుగానే పూర్తి చేయాలి.ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, ప్రత్యేక ప్రవేశ–నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటు చేయాలి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు సమాచార సహాయ కేంద్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్