☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ సైకిల్‌ ఎక్కనున్న యాదాల సాయికిరణ్‌
ఆంధ్రప్రదేశ్

సైకిల్‌ ఎక్కనున్న యాదాల సాయికిరణ్‌

20 Sep 2026 Admin

సైకిల్‌ ఎక్కనున్న యాదాల సాయికిరణ్‌

ఎమ్మెల్యే  ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరిక

మరో రెండు గంటల్లో సైకిల్‌ ఎక్కనున్న యాదాల సాయికిరణ్‌

సాయి కిరణ్ ఆధ్వర్యంలో భారీగా వైసీపీ వీడి టిడిపిలోకి చేరికలు

అనుచర వర్గంతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న సాయికిరణ్

నేడు ఉదయం 10 గంటలకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపంలో కార్యక్రమం

ఎమ్మెల్యే డాక్టర్ ముక్కుఉగ్ర  నరసింహారెడ్డి సమక్షంలో భారీ చేరికలకు ఏర్పాట్లు

పామూరు, సూర్య ప్రతినిధి

 పామూరు మేజర్‌ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్‌ యాదాల వెంకట సాయికిరణ్‌ ఆధ్వర్యంలో మరో రెండు గంటల్లో భారీగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరికలు జరగనున్నాయి. సాయికిరణ్‌తో పాటు ఆయన అనుచర వర్గం టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు పామూరులోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ముక్కు  ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో సాయికిరణ్‌ సైకిల్‌ ఎక్కనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారు.

సాయికిరణ్‌ తండ్రి మాజీ ఎంపీపీ గా యాదాల వై.వి. శేషారావు, తల్లి అనురాధ గతంలో మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌గా సేవలందించారు. పామూరు మేజర్‌ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్‌గా సాయికిరణ్‌ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో టీడీపీలో చేరికలు జరగనుండటంతో పామూరు రాజకీయ వర్గాల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home