☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు
ఆంధ్రప్రదేశ్

యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు

19 Sep 2026 prakasamsuryaa

యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు

- వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీలోకి నాయకులు, కార్యకర్తలు

- నేడు పామూరులో భారీ చేరికల కార్యక్రమం

- ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు

- సాయికిరణ్ ఆధ్వర్యంలో చేరికలకు సర్వం సిద్ధం

పామూరు, మేజర్ న్యూస్ : పామూరు గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ యాదాల వెంకట సాయికిరణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు పామూరులోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో భారీ చేరికల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీలో చేరే వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించనున్నారు. సాయికిరణ్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరనుండటంతో పామూరులో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై చేరికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదాల వెంకట సాయికిరణ్ కోరారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home