☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

18 Sep 2026 Reporter

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం బ్యూరో 

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు ఆర్థిక అంశాలు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న సహకారం, రాష్ట్ర ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాల్సిన అంశాలను మంత్రి పయ్యావుల కేశవ్  కేంద్ర ఆర్థిక మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home