☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఏలూరి మాధవరావు ఉచిత వాటర్‌ క్యాన్లు పంపిణీ
ఆంధ్రప్రదేశ్

ఏలూరి మాధవరావు ఉచిత వాటర్‌ క్యాన్లు పంపిణీ

13 Sep 2026 Reporter

ఏలూరి మాధవరావు ఉచిత వాటర్‌ క్యాన్లు పంపిణీ

- రూ.1.70 లక్షల వ్యయంతో ఇంటింటికీ 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ క్యాన్లు పంపిణీ 

పామూరు, మేజర్ న్యూస్ :  సేవా కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ కంబాలదిన్నె తెలుగు యువత గ్రామ కమిటీ అధ్యక్షుడు ఏలూరి మాధవరావు(కోటయ్య) మానవత్వాన్ని చాటుకున్నారు. కంబాలదిన్నె గ్రామంలోని ఎస్‌ఎల్‌వీ సేవా సమితి ఆధ్వర్యంలో ఏలూరి మాధవరావు సుమారు రూ.1.70 లక్షల వ్యయంతో 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ క్యాన్లను ఇంటింటికీ ఉచితంగా పంపిణీ చేశారు. 1000 క్యాన్లను గ్రామంలోని కుటుంబాలకు అందజేశారు.

ప్రజలకు అవసరమైన సమయంలో తాగునీటి క్యాన్లను ఇంటింటికీ ఉచితంగా అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ఏలూరి మాధవరావును గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో పామూరు గద్దె గంగయ్య చౌదరి, చుంచు కొండయ్య, మన్నం రమణయ్య, గోళ్ల రమేష్‌, సనుమూరి శ్రీను, పొన్నగంటి పెద్ద రోశయ్య, పొన్నగంటి చిన్న రోశయ్య, ఏలూరి మహేశ్వరరావు, యాదాల కొండయ్య, యాదాల చెన్నకేశవులు, మల్లెల శ్రీనివాసులు, ఉమ్మడి పద్మ, ఒంగోలు ప్రతాప్‌, బెజవాడ రఘుబాబు, కోలా కృష్ణమూర్తి, కొమ్మలపాటి రామయ్య, సూరా రమేష్‌, దూదుపల్లి రామకృష్ణ, చుంచు గోపి, కొండమాల కొండయ్య, గోళ్ల మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home