☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు

14 Sep 2026 Reporter

 

ధర్మవరం:

ధర్మవరం పట్టణంలోని కేశవనగర్‌లో వినాయక చవితిని పురస్కరించుకొని బీజేపీ నాయకులు ఎర్రజోడు లోకేశ్, ఎర్రజోడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 1,116 కిలోల గంధంతో భారీ వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ ప్రతిమ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో భక్తులు విశేషంగా తరలివచ్చారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గంధం వినాయకుడికి, లక్ష్మీ-సరస్వతీ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఎర్రజోడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక హోమం వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది ఇలా వినూత్నంగా గంధంతో విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించడం ఆనవాయితీగా వస్తోందని, స్వామివారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home