☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్
ఆంధ్రప్రదేశ్

కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్

20 Sep 2026 venkatrao

తాడిగడప, సెప్టెంబరు 20, మేజర్ న్యూస్ : కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపడుతున్నామని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి ప్రభునగర్, శ్రీనగర్ కాలనీలో మున్సిపాలిటీ సాధారణ నిధులు రూ.33.60 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే బోడే ప్రసాద్, బోడే హేమ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తే నాయకులను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఆదరిస్తారని, ప్రజల అభిమానమే తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆశీస్సులతో ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామని తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో వివిధ శాఖల ద్వారా కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల పనులు చేపట్టామని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, ప్రశాంత వాతావరణం కల్పించేలా మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home