☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్.. పిఠాపురం, కాకినాడలో వివిధ కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్.. పిఠాపురం, కాకినాడలో వివిధ కార్యక్రమాలు

21 Sep 2026 Bangarraju

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సవరించిన పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. సెప్టెంబర్ 21, 22 తేదీలలో ఆయన పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

మొదటి రోజు (సెప్టెంబర్ 21, సోమవారం):

ఉదయం 06:15 గంటలకు మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఉదయం 07:00 గంటలకు విమానంలో రాజమండ్రికి బయలుదేరి, అక్కడ నుండి రోడ్డు మార్గంలో పిఠాపురం నియోజకవర్గానికి వెళ్తారు.

ఉదయం 09:00 గంటలకు ఎఫ్.కె.పాలెం గ్రామంలో చెరువు ఆధునీకరణ పనులను ప్రారంభిస్తారు.

ఉదయం 09:40 గంటలకు పీఠికాపుర వనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

ఉదయం 10:25 గంటలకు యు.కొత్తపల్లిలో నాగులపల్లి సీపీడబ్ల్యూఎస్ మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తారు.

ఉదయం 11:00 గంటలకు కొండేవరం గ్రామంలో ఇంటింటి కుళాయి కనెక్షన్లను పరిశీలించిన అనంతరం పిఠాపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు.

రెండవ రోజు (సెప్టెంబర్ 22, మంగళవారం):

ఉదయం 08:50 గంటలకు గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.

ఉదయం 09:50 గంటలకు పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 04:00 గంటలకు కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు.

కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం కాకినాడ నుండి రాజమండ్రి విమానాశ్రయం మీదుగా తిరిగి మంగళగిరి క్యాంప్ ఆఫీస్ చేరుకుంటారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home