తాడిగడప, సెప్టెంబరు 20, మేజర్ న్యూస్ : తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమలకుదురు గ్రామంలో చేపల మార్కెట్ నుంచి ఆర్సిమ్ చర్చి వరకు రూ.38.53 లక్షల సాధారణ నిధులతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రోజువారీ రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన రహదారులు, మెరుగైన డ్రైనేజీ, అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 26 నెలల్లో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని, మిగిలిన ప్రజా అవసరాలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వం, సహకారంతో పెనమలూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్