☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ బనవాసి నవోదయను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
ఆంధ్రప్రదేశ్

బనవాసి నవోదయను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

15 Sep 2026 Reporter

వనవాసి నవోదయ కళాశాలలో ట్రైనింగ్ ఐఏఎస్ అధికారుల పరిశీలన
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

కర్నూలు జిల్లా బనవాసిలోని జవహర్ నవోదయ విద్యాలయంను ట్రైనీ ఐ ఏ ఎస్ అధికారులు ప్రియం వధా, భరత్, హుస్సేన్  మంగళవారం ఆకస్మికంగా సందర్శించి, విద్యాలయంలోని విద్యా మరియు సహపాఠ్య కార్యక్రమాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు విద్యాలయంలో జరుగుతున్న వివిధ విద్యా, సాంస్కృతిక, క్రీడా మరియు ఇతర విద్యార్థి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతులు, వంటశాల, కిచెన్ గార్డెన్, విద్యాలయంలోని గార్డెన్లు, పార్కులు మరియు పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.అలాగే విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారికి విద్యాలయంలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా, వసతి, భోజనం, విద్య, ఆరోగ్యం తదితర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకున్నారు.
విద్యాలయంలోని పచ్చని పరిసరాలు, పరిశుభ్రమైన వాతావరణం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరియు చక్కగా నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్, గార్డెన్లు, పార్కులను చూసి ట్రైనీ ఐ ఏ ఎస్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.ఇంత మంచి వాతావరణంలో విద్యార్థులు చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతావరణం ఎంతో ఉపయోగకరం అని వారు అభినందించారు.విద్యార్థుల అభివృద్ధికి విద్యాలయం చేస్తున్న కృషిని అధికారులు ప్రశంసించారు. ఈ ఆకస్మిక తనిఖీ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపాల్ ఈ. పద్మావతి అధికారులు పరిశీలించిన అంశాల గురించి వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యాలయంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా వాతావరణం మరియు సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.స్వచ్ఛభారత్ లో భాగంగా విద్యాలయం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అధికారులకు ప్రిన్సిపాల్ వివరించారు

 

                                                                                                        
                                                                                     

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home