☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ బాలాజీ కాంప్లెక్స్ గణపతి మండపంలో విషాదం
ఆంధ్రప్రదేశ్

బాలాజీ కాంప్లెక్స్ గణపతి మండపంలో విషాదం

16 Sep 2026 Madhubabu

నంద్యాలఅర్బన్:బాలాజీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.  గణపతిని చూడడానికి మెడ పైనుంచి తొంగి చూసింది.నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మెడ పైనుంచి జారిపడటంతో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని గణపతి మండపాల నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా మండపాల్లో ఏర్పాటు చేసే విద్యుత్‌ పరికరాలు, వైర్లు, అలంకరణలు, ఎత్తైన ప్రదేశాల వద్ద చిన్నారులకు ప్రమాదం జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
మండపాలకు వచ్చే భక్తులు, ముఖ్యంగా చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. నిర్వాహకులు కూడా విద్యుత్‌ సంబంధిత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు 
తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చిన్నారి మృతికి కారణమైన ఘటనపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలను పరిశీలించి, భద్రతా చర్యలపై తగిన సూచనలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home