తలమడుగు మండలం బరంపూర్ కొండపై వెలసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా అన్నమయ్య లడ్డు వేలం నిర్వహించగా భారీ ధర పలికింది.
ఆదిలాబాద్ కు చెందిన పాములు స్వప్న - శ్రీనివాస్ దంపతులు రూ. 1 లక్ష 47 వేలకు లడ్డు దక్కించుకున్నారు. గత సంవత్సరం సైతం ఈ దంపతులే అన్నమయ్య లడ్డును రూ. 1 లక్ష 7 వేలకు దక్కించుకోవడం విశేషం. వీరిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa