|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 10:30 AM
వేసవిలో ఫ్రిజ్ వాడకం తప్పనిసరి. అయితే, ఫ్రిజ్‌ను తరచూ ఆన్, ఆఫ్ చేయడం వల్ల కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి, దాని జీవితకాలం తగ్గి, ఫ్రిజ్ త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకటి, రెండు రోజులు ఇంట్లో లేకపోయినా ఫ్రిజ్‌ను ఆఫ్ చేయకపోవడమే మంచిది. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు బయటకు వెళ్తేనే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసే ముందు లోపలి వస్తువులన్నీ తీసి, ట్రేలు, ర్యాక్‌లు శుభ్రం చేసి, ఆరబెట్టి, తలుపు కొంచెం తెరిచి ఉంచాలి. విద్యుత్ బిల్లు ఆదా కోసం తరచూ ఆఫ్ చేయడం వల్ల దీర్ఘకాలంలో కంప్రెసర్ దెబ్బతిని పెద్ద ఖర్చు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఫ్రిజ్‌ను నిరంతరం ఆన్‌లో ఉంచడం ఉత్తమం.
Latest News