|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 01:46 PM
సామాన్య మొబైల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) కొత్త నిబంధనలతో రీఛార్జ్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇకపై కేవలం కాల్స్, SMSలు మాత్రమే అవసరమైన వారికి తక్కువ ధరతో ప్రత్యేక ప్లాన్‌లు అందించాలని టెలికాం కంపెనీలకు ఆదేశించింది. ఇప్పటివరకు అవసరం లేకపోయినా డేటా ప్యాక్‌లతో కూడిన ప్లాన్‌లను తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చిన వినియోగదారులకు ఇది పెద్ద ఉపశమనం కానుంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి కంపెనీ కనీసం ఒక కాల్, SMS ప్లాన్‌ను తక్కువ ధరతో అందించాలి.
Latest News