|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 02:04 PM
2015 - 17 బాచ్ కి చెందిన నరసింహకొండ నారాయణ ఐఐటి క్యాంపస్ పూర్వ విద్యార్థి మేడగిరి శ్రీకాంత్ ప్రతిష్టాత్మక సంస్థ GATE ఫలితాల్లో ఆల్ ఇండియా 79వ ర్యాంకు సాధించారు. నరసింహకొండ ఐఐటి క్యాంపస్ లో ఇంటర్మీడియట్ చదివిన నారాయణ పూర్వ విద్యార్థి, ఇంతటి ఘనతను సాధించడం పట్ల నారాయణ యాజమాన్యం శ్రీకాంత్ ను ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా మేడగిరి శ్రీకాంత్ ను.. నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి ఘనంగా సత్కరించి అభినందించారు. తమ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థి శ్రీకాంత్ జాతీయ స్థాయి గేట్- 2026 ఫలితాలలో ఇంతటి ప్రతిభను కనబరచడం నారాయణ విద్యాసంస్థలకు గర్వకారణం అన్నారు. 9 సంవత్సరాల తర్వాత తను చదివిన కాలేజీని గుర్తుంచుకుని మరీ అధ్యాపకుల ఆశీర్వాదం కోసం వచ్చిన ఈ విద్యార్థికి తన ఆశీస్సులను తెలియజేసి.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వి. బి. ఆర్ ఆకాంక్షించారు. డీన్ DVR, ప్రిన్సిపల్ రాజశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Latest News