|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 02:01 PM
గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో 600 కిలోమీటర్ల మేర భారీ చమురు తెట్టు ఏర్పడిందని మెక్సికన్ అధికారులు వెల్లడించారు. 2 సహజ చమురు ఊటలు వ్యాపించడం, ఓ చమురు నౌక సముద్రంలో బోల్తాపడడంవల్ల ఈ ముప్పు సంభవించిందన్నారు. 5 నెలల క్రితం వెరాక్రూజ్‌లో ముడి చమురు పైప్‌లైన్ పగిలిపోవడం, కాంపెచే బేలో మరో చమురు ఊట లీక్ అవ్వడం, 3 నెలల క్రితం చమురు నౌక బోల్తా పడటం వల్లే ఈ తెట్టు ఏర్పడిందన్నారు. సముద్రంలోని జీవరాశులపై ప్రభావం పడిందని, వందల సంఖ్యలో సముద్ర తాబేళ్లు, చేపలతో సహా వివిధ జలచరాలు ప్రాణాలు కోల్పోతున్నాయని అధికారులు తెలిపారు.
Latest News