|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 04:00 PM
విశాఖలోని జీవీఎంసీ 20వ వార్డు కార్పొరేటర్ మువ్వల లక్ష్మి సురేష్ తన ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పెదవాల్తేరు ప్రజలు గురువారం ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని, వార్డు అభివృద్ధిలో లక్ష్మి సురేష్ కనబరిచిన చొరవను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Latest News