|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 11:48 AM
AP: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 27 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన ప్రధాని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Latest News