|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 11:22 AM
AP: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు స్పందించారు. ప్రమాదం జరిగిన సమయానికి గంట ముందు కూడా బస్సును రిపేర్ చేసినట్లు డ్రైవర్ తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది సజీవ దహనమవ్వగా, 28 మందికి గాయాలయ్యాయి. బస్సు కండిషన్ బాగోలేదని గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. ఒక డ్రైవర్ సజీవ దహనమవగా, మరో డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు.
Latest News