|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 11:16 AM
అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ షరతులను ఇరాన్ తిరస్కరించిన నేపథ్యంలో ఆ దేశంపై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైట్ హౌస్ హెచ్చరించింది. ఇరాన్ తన ఓటమిని అంగీకరించకపోతే నిర్ణయాత్మక చర్యలు తప్పవని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ గతంలో చేసిన తప్పుడు అంచనాల వల్ల అగ్ర నాయకత్వం, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కోల్పోయిందని ఆమె గుర్తు చేశారు.
Latest News