|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 04:07 PM
కూటమి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తోందని, నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నెల్లూరు వెళ్లకపోయినా, ఆయన ఐఏఎస్ అధికారులతో సమావేశం అయ్యారని వచ్చిన అబద్ధపు వార్తను ఆధారంగా చేసుకుని నీలకంఠారెడ్డి లాంటి అధికారులను బదిలీ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇది చంద్రబాబు పాలనా వైఫల్యానికి, చేతగానితనానికి అద్దం పడుతోందని విమర్శించారు.
Latest News