|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 04:02 PM
AP: రాష్ట్రంలో ఇంధన కొరత లేదని ఏపీ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ కంపెనీల యాజమాన్యం ముందు రోజు డబ్బు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని చెప్పడంతో, డబ్బుల్లేక కొన్ని బంకులు మూతపడుతున్నాయని వారు తెలిపారు. ఈ నెల 27 నుంచి బ్యాంకులకు సెలవులు ఉండటంతో అడ్వాన్స్ చెల్లించే పరిస్థితి లేదని, ఈ మూడు రోజులు వెసులుబాటు కల్పించకపోతే భారీగా బంకులు మూతపడే అవకాశం ఉందని అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
Latest News