|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 03:16 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు సమీపంలోని కందుల గాది గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన జల జీవన్ మిషన్ పథకం కింద రెండు వాటర్ ట్యాంకులను స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత ప్రారంభించారు. 10,000, 20,000 లీటర్ల సామర్థ్యంతో మొత్తం 30,000 లీటర్ల నీటి నిల్వ సదుపాయం కల్పించడంతో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో రేమాల ఆనందరావు, నాగభూషణం, గాంధీ పడాలా, భేదాళుడు, కిముడు కృష్ణమూర్తి, చిట్టి బాబు, ముత్యం చిన్న బాబు తదితరులు పాల్గొన్నారు.
Latest News