|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 12:17 PM
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా బుల్‌డాగ్ చీమ (Bulldog Ant) పేరుగాంచింది. ఇది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఈ చీమ కుట్టడం వల్ల మనిషి నిమిషాల్లో మరణించే అవకాశముంది. అలాగే, ఫైర్ ఆంట్స్ (Fire Ants) తమ గ్రూపుతో దాడి చేస్తాయని అంటారు. ఇవి కుట్టినప్పుడు కలిగే నొప్పి కాల్చినట్లుగా ఉంటుంది. ఫ్లోరిడా హార్వెస్టర్ చీమ తన విషపూరితమైన కాటుతో తీవ్రమైన వాపును కలిగిస్తుంది. గ్రీన్ ట్రీ ఆంట్స్ (Green Tree Ants) చెట్లపై నివసిస్తూ, తమ గూడును రక్షించుకోవడానికి అత్యంత దూకుడుగా దాడి చేస్తాయి.ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా అడవులలో నివసిస్తాయి. ఇవి చెట్ల ఆకులపై పెద్ద గూళ్లు కట్టుకుని నివసిస్తాయి. వీటికి ప్రాదేశిక స్పృహ ఎక్కువ. ఎవరైనా తమ గూడును తాకితే వేల సంఖ్యలో చీమలు ఒకేసారి మనిషిపైకి దూకి దాడి చేస్తాయి. వీటి కుట్టు వల్ల కలిగే రసాయన ప్రభావం వల్ల తీవ్రమైన నీరసం, స్పృహ కోల్పోవడం వంటివి జరగవచ్చు.పరిమాణంలో చిన్నవైనా ఈ చీమలు తమ ఆత్మరక్షణ కోసం ప్రకృతి ఇచ్చిన కెమికల్ వెపన్స్‌ను వాడుకుంటాయి. అడవులకు లేదా తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి కీటకాల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. అయితే, ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వీటితో పాటు బుల్లెట్ ఆంట్ (Bullet Ant) కూడా చాలా ప్రమాదకరమైనది. దీని కుట్టు వల్ల కలిగే నొప్పి తుపాకీ గుండు తగిలినంత తీవ్రంగా ఉంటుందని చెబుతారు.
Latest News