|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 12:00 PM
తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన ప్రముఖ నేత ఆధవ్ అర్జున, పార్టీ అధినేత విజయ్ ఎన్డీయే కూటమితో పొత్తును తిరస్కరించారని స్పష్టం చేశారు. విజయ్‌కు ఎన్డీయే కూటమిలోకి రావాలని ఆఫర్లు వచ్చినా, రెండున్నరేళ్లు సీఎం పదవి, టీవీకేకు 80 సీట్లు ఇస్తామని చెప్పినా ఆయన వాటిని వద్దనుకున్నారని తెలిపారు. ఢిల్లీకి బానిసగా ఉండే సీఎం పదవి అక్కర్లేదని విజయ్ తేల్చిచెప్పారని, అందుకే జననాయగన్ సినిమాను అడ్డుకుంటున్నారని ఆధవ్ అర్జున పేర్కొన్నారు.
Latest News