|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 02:12 PM
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బాపట్ల శాసనసభ్యులు, వేగేశన ఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్ర వర్మ బుధవారం బాపట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 'రంజాన్ తోఫా' ను పంపిణీ చేశారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలోని వివిధ మసీదులలో నిరంతరం సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్లకు ఈ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రంజాన్ పర్వదినం క్రమశిక్షణ, త్యాగం, దాతృత్వానికి నిదర్శనమని, సమాజంలో శాంతి, ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ఇమామ్, మౌజన్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
Latest News