|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 12:49 PM
మధ్యాహ్నం 20-30 నిమిషాల చిన్న నిద్ర మెదడుకు విశ్రాంతినిచ్చి, పని సామర్థ్యం, ఏకాగ్రతను మెరుగుపరుస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. రాత్రి నిద్ర సరిగా లేనివారికి, అధిక శారీరక శ్రమ చేసేవారికి ఇది రీఛార్జ్‌లా పనిచేస్తుందంటున్నారు. అయితే, గంటకు మించి నిద్రపోతే తలనొప్పి, బద్ధకం, రాత్రి నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయంటున్నారు. నిపుణులు రాత్రిపూట నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం, పడకగదిని ప్రశాంతంగా ఉంచుకోవడం వంటి సూచిస్తున్నారు.
Latest News