|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 05:10 PM
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ అలాంటి వ్యక్తులను పవిత్రమైన పదవుల్లో ఎలా నియమిస్తారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. దేవుడితో ఆడుకోవడం సరికాదని, మహిళలకు అన్యాయం చేసిన వారికి చరిత్రలో ఎలాంటి గతి పట్టిందో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం మహిళలను అడ్డం పెట్టుకుంటున్నారని, ఇప్పుడు మేకతోలు కప్పుకుని మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో మహిళల భద్రత పూర్తిగా గాలికి వదిలేశారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయని లక్ష్మీపార్వతి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రస్తుతం 'అత్యాచారాల ఆంధ్రప్రదేశ్'గా మారిపోయిందని, సామాన్యులే కాకుండా ప్రజాప్రతినిధులుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
Latest News