|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 05:12 PM
వంటగ్యాస్ కొరత నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన సీనియర్ అధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు.టీస్టాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ సహా ఆహార తయారీ కేంద్రాలు ఏవైనా ఎల్పీజీకి బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను ఉపయోగిస్తే ఒక యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో వంటగ్యాస్ కొరత తీవ్రత తగ్గేవరకు సబ్సిడీ వర్తిస్తుందని వెల్లడించారు.
Latest News