|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 05:09 PM
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 92.47 కోట్లు) రివార్డు ఇస్తామని అమెరికా సంచలన ప్రకటన చేసింది.అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ కార్యక్రమం కింద ఈ ప్రకటనను విడుదల చేసింది. మోజ్తబా ఖమేనీతో పాటు రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన కీలక సైనికాధికారులు అలీ అస్ఘర్ హెజాజీ, సెక్యూరిటీ చీఫ్ అలీ లారీజానీ పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చింది. కొందరి ఫోటోలు అందుబాటులో లేకపోవడంతో వారి షాడో చిత్రాలను ప్రచురించింది.
Latest News