|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 05:08 PM
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా అయన స్పందిస్తూ.. జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు.
Latest News