దమ్ముంటే కూటమి పాలనలో చేసిన అప్పులపై ఆర్థిక‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శితో అధికారికంగా ప్రకటించండి
 

by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:43 PM

రాష్ట్రంలో కూట‌మి ఏర్పడ్డాక కేవ‌లం రూ.1.05 ల‌క్ష‌ల కోట్ల అప్పులే చేశామ‌ని, ఏనాడూ నెట్ బారోయింగ్స్ అధిగ‌మించ‌లేద‌ని చెబుతున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశ‌వ్.. ఇవే మాట‌ల‌ను ఆర్థిక‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శితో రాయించి అధికారికంగా ప్ర‌భుత్వం విడుద‌ల చేసే ద‌మ్ముందా అని  కృష్ణా జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పేర్ని పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని) స‌వాల్ విసిరారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ఆర్థిక విధ్వంసం జ‌రిగింద‌ని ప‌య్యావుల కేశ‌వ్ నోటితో చెబితే స‌రిపోద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ లా ఆధారాల‌తో నిరూపించాల‌ని డిమాండ్ చేశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక రూ. 3.27 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసిన‌ట్టు పేర్ని నాని కాగ్ లెక్క‌ల‌తో వివరించారు. నెట్ బారోయింగ్స్ దాటి అప్పులు చేయ‌లేదని ప‌య్యావుల ప‌చ్చి అబ‌ద్దం చెప్పాడ‌ని కాగ్ వెబ్‌సైట్ సాక్షిగా ఆయ‌న నిరూపించారు. మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ చెప్పిన‌ట్టు కూట‌మి అప్పులు రూ. 1.05 ల‌క్ష‌ల కోట్ల‌ని వారం రోజుల్లో నిరూపించ‌లేక‌పోతే అబ‌ద్ధాల కేశ‌వ్ అని నేమ్ బోర్డు మార్చుకోవాల‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పుల‌పై అసెంబ్లీ, మండ‌లిలో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చిన సంబంధిత అధికారుల‌పై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రి అయిన ప్ర‌ధానికి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. చంద్ర‌గిరిలో ఉన్న చంద్ర‌బాబు కుటుంబ సంస్థ‌ హెరిటేజ్ యూనిట్‌లో మెషిన‌రీ అప్‌గ్ర‌డేష‌న్ కోసం ప్ర‌భుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకోవ‌డంపై ఆయ‌న మండిపడ్డారు. 

Latest News
BJP, Trinamool spar over clashes during Ram Navami rallies in Bengal Sat, Mar 28, 2026, 04:21 PM
'Milestone day' as Adani Defence delivers 1st batch of 'Prahar' light machine guns to Army Sat, Mar 28, 2026, 04:12 PM
Jewar International Airport to boost jobs, investment: Ram Mohan Naidu Sat, Mar 28, 2026, 04:11 PM
India refutes Elon Musk's presence in PM Modi-Trump call on West Asia Sat, Mar 28, 2026, 04:08 PM
Pakistan LPG price surge intensifies hardship for citizens Sat, Mar 28, 2026, 04:01 PM