|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:45 PM
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత నిధులపై కూటమి ప్రభత్వం చెబుతున్నవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ నిధుల్ని పూర్తిగా ఎగ్గొట్టిన ప్రభుత్వం, రెండో ఏడాది రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు మూడో విడతలోనూ 7 లక్షల రెతులకు పథకంలో కోత పెట్టారని తప్పుబట్టారు. ఇప్పటికే గిట్టుబాటు ధరల్లేక, ఇన్‌పుట్ సబ్సిడీ అందక, ఉచిత పంటల బీమా ఎత్తిపోయి.. దిక్కుతోచక రైతులు చివరకు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు.
Latest News