|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:39 PM
బొబ్బిలి పట్టణంలోని అన్న క్యాంటీన్ ఆవరణలో భోజనం చేసే ప్రజలు ఎండలో ఇబ్బందులు పడకుండా శాశ్వత షెడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇటీవల క్యాంటీన్‌ను సందర్శించినప్పుడు ప్రజలు ఎండలో భోజనం చేస్తుండటం గమనించి ముందుగా షామియానాలు వేయించారు. శనివారం బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడుతో కలిసి మళ్లీ క్యాంటీన్‌ను పరిశీలించి త్వరలోనే శాశ్వత షెడ్డు నిర్మించాలని మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్, కమిషనర్ రామలక్ష్మి, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
Latest News