|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:40 PM
పేద విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ట్రై పార్టీ అగ్రిమెంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండేళ్లుగా వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను పూర్తిగా తుంగలో తొక్కింది. విద్యా దీవెన కింద 2024 మార్చి నుంచి 2026 మార్చి వరకు మొత్తం 9 క్వార్టర్లకు ఒక్కో క్వార్టర్‌కు రూ.700 కోట్లు అవసరం. అంటే ఈ కాలానికి రూ.6,300 కోట్లు విడుదల చేయాలి. ప్రస్తుత బడ్జెట్‌లో మరో నాలుగు క్వార్టర్లు కూడా కలిపితే మొత్తం 13 క్వార్టర్లకు రూ.9,100 కోట్లు అవసరం అవుతాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం రూ.1,859 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు అసెంబ్లీలో సమాధానం ఇచ్చింది. అంటే సుమారు రూ.7,241 కోట్లు పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద బాకీ పడ్డారు అని అన్నారు.
Latest News